తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'డిజిటల్​ లావాదేవీలపై ఛార్జీలు నిల్'

ప్రభుత్వం డిజిటల్​ లావాదేవీల వినియోగాన్ని పెంపొందించడానికి ఎన్నో చర్యలు చేపట్టిందని నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. ఈ మేరకు ఏడాదికి రూ.1 కోటి తీసే వారి నుంచి 2శాతం టీడీఎస్​ వసూలు చేయాలని ప్రతిపాదించారు.

By

Published : Jul 5, 2019, 5:45 PM IST

'నగదు రహిత లావాదేవీలకై మరిన్ని చర్యలు'

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. ఇందులో భాగంగా సంవత్సరానికి ఒక బ్యాంక్​ ఖాతా నుంచి కోటి రుపాయలు తీసే వారిపై 2శాతం టాక్స్​ డిడక్షన్​ ఎట్​ సోర్స్​ (టీడీఎస్​) విధించాలని నిర్మల ప్రతిపాదించారు.

'నగదు రహిత లావాదేవీలకై మరిన్ని చర్యలు'

"డిజిటల్​ లావాదేవీల ప్రచారానికి మా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. వీటిని ముందుకు తీసుకెళ్లడానికి, నగదు రహిత వ్యాపారం కోసం మరిన్ని కఠిన చర్యలు చేపట్టాలి. ఒక బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి కోటి రూపాయలు తీసే వారిపై 2 శాతం టీడీఎస్ విధించాలని నేను ప్రతిపాదిస్తున్నా."
-నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి.

50 కోట్లకన్నా ఎక్కువ వార్షిక ఆదాయమున్న వ్యాపారులు... డిజిటల్​ విధానంలో లావాదేవీలు జరిపితే ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించారు నిర్మల. ఈ మినహాయింపు వ్యాపారులకు, వినియోగదారులకు వర్తిస్తుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details