తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేటితో 'నిర్భయ' ఘటనకు ఏడేళ్లు.. న్యాయం సంగతేంటి?

దిల్లీలో నిర్భయ ఘటన జరిగి నేటితో ఏడేళ్లు పూర్తయింది. అప్పటినుంచి ఆమె తల్లిదండ్రులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.  తమకు న్యాయం జరుగుతుందని విశ్వాసం ఉందని.. అయితే న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని కోరుతున్నారు. నిందితులు దాఖలు చేసే రివ్యూపిటిషన్​, క్షమాభిక్ష పిటిషన్​లకు నిర్ణీత సమయం కేటాయించాలని అభిప్రాయపడ్డారు.

NIRBHAYA PARENTS
నిర్భయ ఘటనకి ఏడేళ్లు

By

Published : Dec 16, 2019, 5:41 AM IST

Updated : Dec 16, 2019, 6:07 AM IST

దేశ రాజధాని దిల్లీలో పాశవిక హత్యాచార ఘటన 'నిర్భయ' జరిగి నేటితో ఏడేళ్లైంది. అయినా ఇంతవరకు ఆమెకు, వారి కుటుంబానికి న్యాయం జరగలేదు. న్యాయం జరుగుతుందనే ఆశతో ఇంకా నిర్భయ తల్లితంద్రులు పోరాటం చేస్తూనే ఉన్నారు. నిందితులు రివ్యూ పిటిషన్​, క్షమాభిక్ష దాఖలు చేసుకోవటానికి నిర్ణీత సమయం కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నారు.

దేశంలో జరుగుతున్న హత్యాచారాలను ప్యాన్​ ఇండియా సమస్యగా నిర్భయ తల్లిదండ్లులు అభివర్ణించారు.

"దిల్లీ... మా కుటంబాన్ని పూర్తిగా కుంగదీసింది. కానీ మేము దిల్లీని అసహ్యించుకోవటం లేదు. ఎందుకంటే మా సొంత రాష్ట్రమైన ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఇలాంటి ఘుటనలు జరుగుతున్నాయి. ఈ ప్రపంచంలో ఇలాంటి ఘటనలు జరగని ప్రాంతమే లేదు. కనుక ప్రపంచాన్ని అసహ్యించుకోవాల్సిన పనిలేదు. "

-నిర్భయ తల్లి

మార్పు రావాలి...

న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని నిర్భయ తండ్రి సూచించారు. హత్యాచారాలకు ఒడిగట్టే నిందితులు క్షమాభిక్షకై దాఖలు చేసిన వ్యాజ్యలు, రివ్యూ పిటిషన్​ల​కు నిర్ణీత సమయం కేటాయించాలన్నారు. అప్పుడే త్వరగా వారికి శిక్షపడే అవకాశం ఉందన్నారు.

ఇలాంటి హత్యాచార ఘటనలు జరిగినప్పుడు ట్రయల్​ కోర్టులో న్యాయవిచారణకి సమయం పట్టడాన్ని తాము సమర్థిస్తామని తెలిపారు. కానీ హైకోర్ట్​, సర్వోన్నత న్యాయస్థానంలో జాప్యం జరగడం సరికాదన్నారు. కింది న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించి రాత్రి వ్యవధిలోనే పరిష్కరించాలని వెల్లడించారు. కేసులను ఆన్​లైన్​లో నమోదు చేయాలని అన్నారు.

"నిందితులకు ఉరిశిక్ష పడిన తర్వాతే నిర్భయకు న్యాయం జరుగుతుంది. దేశంలో మరెంతోమంది నిర్భయలాంటి వారు ఉన్నారు. వారి కోసం మేము పోరాడతాం."

-నిర్భయ తండ్రి

'దిశ' ఎన్​కౌంటర్​...

దిశ నిందితులను ఎన్​కౌంటర్​ చేయడాన్ని సరైన చర్యగా సమర్థించారు నిర్భయ తల్లిదండ్రులు. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదన్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ కొడుకులకు ఆడపిల్లలని గౌరవించడం చిన్నతనం నుంచే అలవాటయ్యే విధంగా పెంచాలని కోరారు.

ఇదీ చూడండి : అట్టుడుకుతున్న దిల్లీ... ఘర్షణల్లో 40మందికి గాయాలు

Last Updated : Dec 16, 2019, 6:07 AM IST

ABOUT THE AUTHOR

...view details