తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉరిశిక్ష' అమలుకై కోర్టుకు 'నిర్భయ' తల్లిదండ్రులు - నిర్భయ కేసు: కొత్త డెత్​ వారెంట్​ కోసం కోర్టుకు తల్లిదండ్రులు

నిర్భయ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఉరి శిక్ష ఓ సారి వాయిదా పడగా.. మరింత ఆలస్యం కోసం దోషులు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్​ శర్మ.. సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తన క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ పిటిషన్​ దాఖలు చేశాడు. అయితే దోషులకు కొత్త డెత్​ వారెంట్ ప్రకటించాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై కోర్టు బుధవారం విచారించనుంది.

Nirbhaya's parents move Delhi court seeking death warrant for convicts; hearing Wednesday
నిర్భయ కేసు: కొత్త డెత్​ వారెంట్​ కోసం కోర్టుకు తల్లిదండ్రులు

By

Published : Feb 11, 2020, 9:02 PM IST

Updated : Mar 1, 2020, 12:44 AM IST

నిర్భయ హత్యాచారం కేసులో ఉరి శిక్ష తప్పించుకునేందుకు దోషులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉన్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్​ శర్మ.. రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కూడా తన పిటిషన్‌లో అభ్యర్థించాడు. వినయ్​కు క్షమాభిక్షను ఫిబ్రవరి 1న నిరాకరించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.

కేంద్రానికి ఆ స్వేచ్ఛ ఉంది...

ఉరిశిక్షపై స్టే తొలగించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ.. కేంద్రం, దిల్లీ సర్కార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిచింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్​పై తన అభిప్రాయం తెలపాలంటూ నాలుగో దోషి ముకేశ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

తాజాగా డెత్‌ వారెంట్‌ జారీ కోసం కింది కోర్టుకు వెళ్లేందుకు కేంద్రానికి, దిల్లీ ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉందని జస్టిస్‌ ఆర్​భానుమతి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. కేంద్రం, దిల్లీ ప్రభుత్వ పిటిషన్లు తమ వద్ద పెండింగ్‌లో ఉండటం.. కింది కోర్టుకు వెళ్లడానికి అడ్డు ఏమీ కాదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. దోషులకు ఉరిశిక్ష అమలు చేయడం చట్టాన్ని పాటించడం తప్ప.. ఆనందాన్ని అనుభవించడం కాదని అన్నారు.

నిర్భయ తల్లిదండ్రులు...

సుప్రీంకోర్టు డెత్​ వారెంట్​ జారీ కోసం కింది కోర్టు వెళ్లవచ్చని తీర్పునిచ్చిన నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం నిర్భయ దోషులకు కొత్త డెత్​ వారెంట్​ ప్రకటించాలంటూ ట్రయల్​ కోర్టు ఆశ్రయించారు. దోషులు చట్టాలను అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ పిటిషన్​పై కోర్టు బుధవారం విచారణ జరపనుంది.

ఇదీ చూడండి:కాంగ్రెస్​ వరుసగా రెండోసారి 'డక్'.. నేతల్లో కలవరం

Last Updated : Mar 1, 2020, 12:44 AM IST

ABOUT THE AUTHOR

...view details