తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2019, 9:38 AM IST

ETV Bharat / bharat

'దిశ' నిందితుల హతంపై 'నిర్భయ' తల్లి హర్షం

తెలంగాణ పోలీసులు 'దిశ' హత్యాచారం కేసు నిందితులను ఎన్​కౌంటర్​ చేయడాన్ని నిర్భయ తల్లి స్వాగతించారు. పోలీసుల చర్య తనకు చాలా ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. నిర్భయ నేరస్థులను కూడా త్వరలోనే ఉరితీయాలని ఆమె ప్రభుత్వానికి, న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

Nirbhaya's mother
'దిశ' నిందితుల హతంపై 'నిర్భయ' తల్లి హర్షం

'దిశ' హత్యాచారం కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై నిర్భయ తల్లి ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులు చాలా మంచి పనిచేశారని ప్రశంసించారు. అందువల్ల వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని విజ్ఞప్తి చేశారు.

నిర్భయకు న్యాయం చేయాలని ఏడు సంవత్సరాలుగా తాను పోరాడుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ నేరస్థులను కూడా త్వరలోనే ఉరితీయాలని ప్రభుత్వాన్ని, న్యాయస్థానాలను కోరారు.

'దిశ' నిందితుల హతంపై 'నిర్భయ' తల్లి హర్షం

"హైదరాబాద్​లో ఈ శిక్ష పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. పోలీసులకు చాలా ధన్యవాదాలు. వారు ఓ సంచలనం సృష్టించారు. నిందితులు నేరం చేశారు. పోలీసులపైకి రాళ్లు విసిరి మోసం చేసి పారిపోవాలనుకున్నారు. అందుకే పోలీసులు చాలా మంచి పని చేశారు. వారు చేసిన పనిని నేను స్వాగతిస్తున్నాను. పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. వారు ఓ మార్పు తీసుకొచ్చారు. తప్పు చేసేందుకు నేరస్థులకు మనసు ఎలా వచ్చిందో అలానే వారికి శిక్ష పడాలి.

నేను ఏడేళ్లుగా పోరాటం చేస్తున్నాను. కోర్టుల చుట్టు తిరుగుతున్నా. ఇప్పుడు కూడా దిగువ కోర్టులో నిర్భయ నిందితులకు ఉరి శిక్ష వేయమని కోరుతున్నాను. కానీ, వారికి మానవహక్కుల కారణంగా శిక్ష వేయలేము అంటోంది. ఈ రోజు కోర్టులు, ప్రభుత్వాలు, దిల్లీ పోలీసులు... హైదరాబాద్​ పోలీసులు ఏం చేశారో చూడాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పుడైన నిర్భయ నిందితులను శిక్షించాలని న్యాయవ్యవస్థ, సర్కారులను కోరుతున్నా. హైదరాబాద్​లో కచ్ఛితంగా ఏదో మార్పు వచ్చిందని నేను నమ్ముతున్నాను. అక్కడ నిందితులకు 10 రోజుల్లో శిక్ష పడింది. దిశ తల్లిదండ్రులకు మా దుస్థితి రాకూడదని నేను కోరుకున్నాను. ఈ రోజు ఆ మాటే నిజమైంది. ప్రభుత్వం, పోలీస్​ కమీషనర్​ల​ను కోరేది ఒక్కటే.. పోలీసుల చేతులను కట్టేయకండి." - నిర్భయ తల్లి

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: ప్రాణాలకు తెగించి కాపాడిన ఆర్​పీఎఫ్ కానిస్టేబుల్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details