నిర్భయ దోషులకు కొత్తగా డెత్ వారెంట్లు విడుదల చేయాలని తీహార్ జైలు అధికారులు దిల్లీకోర్టును విజ్ఞప్తి చేశారు. దోషుల పిటిషన్లు ఎక్కడా పెండింగ్‌లో లేనందున శిక్ష అమలు తేదీ ఖరారు చేయాలని కోరారు. తిహార్ అధికారుల తాజా పిటిషన్పై కోర్టు దోషుల అభిప్రాయాన్ని కోరింది.
నిర్భయ దోషుల ఉరిపై దిల్లీ కోర్టుకు తిహార్ అధికారులు - నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్లు
నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేయాలని.. దిల్లీ కోర్టులో తిహార్ జైలు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దోషులకు ఉరిశిక్ష విధించాలని ఇప్పటికే రెండు సార్లు తీర్పునిచ్చింది కోర్టు.
నిర్భయ దోషుల ఉరిపై దిల్లీ కోర్టుకు తిహార్ అధికారులు
నలుగురు దోషులకు కోర్టు ఇప్పటికే రెండు సార్లు డెత్ వారెంట్లు జారీ చేసింది. తమకు న్యాయ అవకాశాలు ఉన్నాయని దోషులు తెలపడం వల్ల జనవరి 31న ఉరిపై కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉరి అమలును నిలిపివేయాలని ఆదేశించింది. ప్రస్తుతం దోషులు తీహార్ జైలులో ఉన్నారు.
ఇదీ చదవండి: ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై.. చిన్నారులు సహా ఏడుగురు మృతి
Last Updated : Feb 29, 2020, 10:12 AM IST