నిర్భయ దోషులలో ఒకడైన ముకేశ్ కుమార్... రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు తిహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు.
నిర్భయ కేసులో మరో మలుపు.. ముకేశ్ క్షమాభిక్ష అర్జీ - nirbhaya rape convict filed mercy pitition in supreme court
నిర్భయ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. జనవరి 22న ఉదయం మరణ శిక్ష అమలు కానున్న నేపథ్యంలో దోషుల్లో ఒకరైన ముకేశ్ కుమార్... రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు ముకేశ్ అర్జీ చేసినట్లు తిహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు.
నిర్భయ కేసులో మరో మలుపు-దోషి క్షమాభిక్ష పిటిషన్
2012లో దిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచార కేసులో నలుగురు దోషులకు దిల్లీ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ నెల 22న ఉరిశిక్ష అమలు కానున్న నేపథ్యంలో చివరి అవకాశంగా క్షమాభిక్ష ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముకేశ్ కుమార్‌తో పాటు దోషులుగా తేలిన పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లకు వేసిన ఉరిశిక్ష జనవరి 22న ఉదయం 7 గంటలకు అమలు కానుంది.
Last Updated : Jan 14, 2020, 9:47 PM IST