సుప్రీంకోర్టు డెత్ వారెంట్ జారీ కోసం కింది కోర్టు వెళ్లవచ్చని తీర్పునిచ్చిన నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ చేయాలంటూ ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరపనుంది. దోషులు చట్టాలను అవహేళన చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు వ్యాజ్యంలో ఆరోపించారు.
అయితే నిర్భయ హత్యాచారం కేసులో ఉరి శిక్ష తప్పించుకునేందుకు దోషులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ.. రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కూడా తన పిటిషన్‌లో అభ్యర్థించాడు. వినయ్‌కు క్షమాభిక్షను ఫిబ్రవరి 1న నిరాకరించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
కేంద్రానికి ఆ స్వేచ్ఛ ఉంది...