తెలంగాణ

telangana

By

Published : Jan 13, 2020, 9:44 AM IST

Updated : Jan 13, 2020, 11:32 AM IST

ETV Bharat / bharat

నిర్భయ దోషులకు 'ఉరి' ట్రయల్స్​ పూర్తి

'నిర్భయ' దోషులకు ఉరిశిక్ష అమలు నేపథ్యంలో ఆదివారం ట్రయల్స్ నిర్వహించారు జైలు అధికారులు. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు తిహార్ జైలులో నలుగురు దోషులను ఉరి తీయాల్సిందిగా ఇటీవలే దిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది.

Nirbhaya gangrape case: Dummy execution of four convicts performed in Tihar
నిర్భయ దోషులకు 'ఉరి' ట్రయల్స్​ పూర్తి

నిర్భయ దోషులకు 'ఉరి' ట్రయల్స్​ పూర్తి

నిర్భయ దోషులకు దిల్లీ కోర్టు డెత్ వారెంట్​​ జారీ చేసిన నేపథ్యంలో ఉరి శిక్ష కోసం ఆదివారం ట్రయల్స్​ నిర్వహించారు జైలు అధికారులు.

నిర్భయ కేసులో నిందితులైన ముకేశ్​(32), పవన్​ గుప్తా(25), వినయ్​ శర్మ(26), అక్షయ్​ కుమార్​ సింగ్​(31)లను ఈ నెల 22న ఉదయం 7 గంటలకు తిహార్​ జైలులో ఉరి తీయాల్సిందిగా దిల్లీ కోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే ఉరిశిక్ష అమలులో భాగంగా ట్రయల్స్ నిర్వహించారు అధికారులు.
దోషుల బరువు ప్రకారం ఇసుక, రాళ్లతో నిండిన బస్తాలను ట్రయల్స్​లో ఉపయోగించినట్లు జైలు సీనియర్​ అధికారి ఒకరు పేర్కొన్నారు.
తలారి వస్తున్నాడు..

ఈ నలుగురు దోషులను ఉరి తీసేందుకు.. పవన్​ జల్లాద్​​నే పంపనున్నట్లు యూపీ పోలీసు అధికారులు ధ్రువీకరించారని స్పష్టం చేశారు తిహార్​ జైలు సిబ్బంది. 2013లో పార్లమెంటుపై దాడి దోషి అఫ్జల్‌ గురును ఉరి తీసిన జైలు నెంబర్​ 3లోనే నిర్భయ దోషులకు మరణ శిక్ష అమలు చేయనున్నారు. నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ప్రపంచంలోనే తొలి 'చిల్డ్రన్​ న్యూట్రిషన్​ పార్క్'

Last Updated : Jan 13, 2020, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details