తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మేరఠ్​ తలారి, బక్సర్​ తాడుతో నిర్భయ దోషులకు ఉరి! - నిర్భయ తాజా వార్తలు

నిర్భయ దోషులకు డెత్​ వారెంట్​ జారీ చేసిన కొద్ది గంటల్లోనే.. ఉరిశిక్ష అమలు కోసం కావాల్సినవి సిద్ధం చేస్తున్నారు అధికారులు. తిహార్​లోని జైల్​ నంబర్​- 3లో నిర్భయ దోషులను ఉరి తీయనున్నారు. ఇప్పటికే తలారి కోసం ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​కు అధికారులు కబురు పంపినట్లు సమాచారం.

nirbhaya-convicts-to-be-executed-in-jail-no-3
మేరఠ్​ తలారి, బక్సర్​ తాడుతో నిర్భయ దోషులకు ఉరి!

By

Published : Jan 7, 2020, 7:18 PM IST

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు సర్వం సిద్ధం చేస్తున్నారు తిహార్ జైలు అధికారులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నలుగురు దోషులకు దిల్లీ పటియాలా హౌస్​ కోర్టు డెత్​ వారెంట్​ జారీచేసిన కొద్ది గంటల్లోనే ఈ ప్రక్రియ మొదలైంది.

తిహార్​లోని జైల్​ నంబర్​-3లో దోషులకు మరణశిక్ష అమలు కానుంది. తలారి కోసం ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​ అధికారులను తిహార్​ సిబ్బంది సంప్రదించినట్లు సమాచారం.

ఉరి తాళ్లు తయారు చేయాల్సిందిగా బిహార్​లోని బక్సర్​ జైలుకు ఎప్పుడో ఆదేశాలు వెళ్లాయి. ఉరి తాళ్ల తయారీలో బక్సర్​ జైలుకు మంచి పేరు ఉంది.

బక్సర్​ ఉరి తాళ్ల విశేషాలు:

ఒక్కో ఉరి తాడు తయారీకి 3 రోజులు పడుతుంది. తయారీ అంతా దాదాపుగా చేతి పనే. యంత్రాల వాడకం చాలా తక్కువ.

ఉగ్రవాది అఫ్జల్​ గురుకు మరణశిక్ష అమలుకు బక్సర్ ఉరి తాడునే ఉపయోగించారు.

ఖరీదు ఎక్కువే...

చివరిసారిగా బక్సర్ జైలు సరఫరా చేసిన ఉరి తాడు ధర.1,725గా ఉంది. ఈ ధర ఉక్కు, ఇత్తడి ధరల ఆధారంగా మారుతుంది. ఈ లోహాలతో తయారుచేసే తాడు మనిషికి ఉరేసినప్పుడు తెగకుండా ఉంటుంది. గొంతుకు వెంటనే బిగుసుకొని క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది.

"ఈ ఉరితాళ్లను సాధారణంగా ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు తయారుచేస్తారు. 7000 దారం పోగులతో ఒక తంతువు తయారుచేస్తారు. ఇలాంటి 152 తంతువులు ఉపయోగించి కావలసిన కొలతలతో ఒక ఉరితాడు తయారుచేస్తారు."
-విజయ్ కుమార్​ అరోడా, బక్సర్​ జైలు ఎస్పీ

ఈ తాళ్లను ముందుగానే తయారుచేసి ఉంచరు. ఎందుకంటే కాలం గడిచిన కొద్దీ ఇవి పటుత్వం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే అవసరమైనప్పుడే వీటిని తయారుచేస్తారు.

ABOUT THE AUTHOR

...view details