తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2020, 3:25 PM IST

Updated : Feb 18, 2020, 6:04 AM IST

ETV Bharat / bharat

ఉరిశిక్ష తప్పించుకునేందుకు నిర్భయ దోషుల పాట్లు

ఉరిశిక్షను తప్పించుకునేందుకు సకల విధాలా ప్రయత్నిస్తున్నారు నిర్భయ దోషులు. ఫిబ్రవరి 1న మరణశిక్ష అమలుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో దిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దోషులు. క్యురేటివ్ పిటిషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను తిహార్ జైలు అధికారులు అందించడం లేదని కోర్టుకు తెలిపారు.

nirbhaya-convicts-move-court
ఉరిశిక్ష తప్పించుకునేందుకు నిర్భయ దోషుల పాట్లు

నిర్భయ అత్యాచార కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న మరణ శిక్ష అమలుకు ఏర్పాట్లు కొనసాగుతున్న వేళ.. దాన్ని తప్పించుకునే ప్రయత్నాలను వారు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా తాము క్యురేటివ్ పిటిషన్‌ దాఖలు చేసేందుకు అవసరమైన పత్రాలను తిహార్​ జైలు అధికారులు అందించడం లేదని దిల్లీ న్యాయస్థానంలో ఇద్దరు దోషులు అక్షయ్‌ కుమార్ సింగ్‌, పవన్‌ సింగ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శనివారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మరో ఇద్దరు దోషులు వినయ్‌ కుమార్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌ దాఖలు చేసిన క్యురేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Last Updated : Feb 18, 2020, 6:04 AM IST

ABOUT THE AUTHOR

...view details