తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిటిషన్​పై అత్యవసర విచారణకు నిర్భయ దోషి​ అభ్యర్థన - nirbhaya case

క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​పై మరోమారు సుప్రీంను ఆశ్రయించాడు నిర్భయ దోషి ముకేశ్​.. అత్యవసర విచారణ చేపట్టాలని అభ్యర్థించాడు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్​లో దరఖాస్తు చేసుకోవాలని ముకేశ్​కు సూచించించి న్యాయస్థానం.

Nirbhaya
Nirbhaya

By

Published : Jan 27, 2020, 11:38 AM IST

Updated : Feb 28, 2020, 3:04 AM IST

క్షమాభిక్షను నిరాకరిస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంలో సవాలు చేసిన నిర్భయ దోషి ముకేశ్​ కుమార్​.. అత్యవసర విచారణకు స్వీకరించాలని అభ్యర్థించాడు. పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీం రిజిస్ట్రార్​ వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

"ఎవరైనా మరణ శిక్షకు దగ్గరగా ఉన్నప్పుడు అంతకన్నా అత్యవసరమైనదేదీ ఉండదు. ఈ పిటిషన్​ను సుప్రీం రిజిస్ట్రార్​ వద్ద దరఖాస్తు చేసుకోవాలి."

- సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం

మరణ దండన నుంచి ఉపశమనం కలిగించాలని ముకేశ్​ వేసిన క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ తిరస్కరించారు. నిర్భయ దోషులు నలుగురికి ఫిబ్రవరి 1న మరణ శిక్ష విధించాలని దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Feb 28, 2020, 3:04 AM IST

ABOUT THE AUTHOR

...view details