'ఉరి' భయంతో మళ్లీ సుప్రీంకు నిర్భయ దోషి - nirbhaya convicts
14:10 January 25
'ఉరి' భయంతో మళ్లీ సుప్రీంకు నిర్భయ దోషి
ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు అన్ని మార్గాలను వెతుకుతున్నారు. తమ పిటిషన్లు ఎన్నిసార్లు తిరస్కరణకు గురైనా.. పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోమారు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు దోషి ముఖేశ్ కుమార్. తన క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ వ్యవహారంపై న్యాయ సమీక్ష జరపాలని అభ్యర్థించాడు.
ముఖేశ్ కుమార్ క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 17న తిరస్కరించారు. అనంతరం నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు చేయాలని దిల్లీ హైకోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.
TAGGED:
nirbhaya convicts