తీర్పు వాయిదా
నిర్భయ దోషి ముకేశ్ పిటిషన్‌కు సంబంధించి ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.
15:17 January 28
తీర్పు వాయిదా
నిర్భయ దోషి ముకేశ్ పిటిషన్‌కు సంబంధించి ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.
15:06 January 28
ఈ కారణాలతో క్షమాభిక్ష పెడతారా?
దోషి ఆరోపిస్తున్నట్లు అతనిని ప్రత్యేక నిర్బంధంలో ఉంచలేదని కేంద్రం స్పష్టం చేసింది. జైలులో అతని పట్ల ప్రవర్తనను చూసి.. దారుణమైన నేరాలను పాల్పడినవారికి క్షమాభిక్ష ప్రసాదించలేరని తెలిపారు మెహతా. జైలులో ఉన్నప్పుడు ముకేశ్‌ను లైంగిక వేధించారని అతని తరఫు న్యాయవాది అంజనా ప్రకాశ్ చేసిన ఆరోపణలపై మెహతా ఈ విధంగా సమాధానమిచ్చారు.
ఉరిశిక్ష పడినవారు అనారోగ్యంగా ఉన్నట్లయితే మరణ దండన విధించలేమని.. అయితే దోషి ఆరోగ్యంగానే ఉన్నట్లు కోర్టుకు తెలిపారు సొలిసిటర్ జనరల్.
14:57 January 28
కేంద్రం తరఫున తుషార్ మెహతా వాదనలు
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తున్నారు.
"నిర్భయ కేసులకు సంబంధించిన అన్ని విచారణల్లో రాష్ట్రపతి పాల్గొనలేరు. క్షమాభిక్షకు సంబంధించి మాత్రమే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. కేసులో ప్రతి విషయాన్ని, విచారణ జరిగిన పద్ధతిని పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి కొన్ని ప్రత్యేక కేసుల్లో న్యాయసమీక్ష పరిధి చాలా పరిమితంగా ఉంటుంది."
-తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్
క్షమాభిక్షకు సంబంధించి రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కేంద్ర హోంశాఖ చేసిందని మెహతా తెలిపారు. ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటే ప్రతికూల ప్రభావం పడుతుందని మెహతా కోర్టుకు విన్నవించారు.
14:26 January 28
నిర్భయ కేసు: 'రాష్ట్రపతి గురించి అలా ఎలా అంటారు?'
క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిర్భయ కేసు దోషి ముఖేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రపతి సరిగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారని ఎలా ఆరోపిస్తారని దోషిని న్యాయస్థానం నిలదీసింది.
నిర్భయ కేసుకు సంబంధించిన వాస్తవాలను క్షమాభిక్ష పిటిషన్‌తో పాటు రాష్ట్రపతి ముందు ఉంచలేదని ముఖేశ్ తరఫు న్యాయవాది వాదించగా... మీరెలా చెప్పగలరని ప్రశ్నించింది ధర్మాసనం. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు రాష్ట్రపతి వద్దకు చేరాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణలో విధానపరమైన లోపాలున్నాయని ముఖేశ్ తరఫు న్యాయవాది ఆరోపించారు. వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.
TAGGED:
nirbhaya verdict