నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్న వేళ వీరిలో ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
నిర్భయ దోషి పిటిషన్‌పై నేడు 'సుప్రీం' విచారణ - పవన్ గప్తా పిటిషన్‌పై నేడు విచారణ
నిర్భయ కేసు.. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి.
నేడు నిర్భయ దోషి పిటిషన్‌పై సుప్రీంలో విచారణ
2012 డిసెంబర్లో నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌ను అంటూ చేసిన వాదనను దిల్లీ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టును ఈ నెల 17న ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం వాదనలు విననుంది.
ఇదీ చదవండి: క్రికెట్‌తో అలరించిన భారత ప్రధాన న్యాయమూర్తి
Last Updated : Jan 20, 2020, 9:02 AM IST