నిర్భయ దోషి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. తన క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దోషి ముఖేశ్ కుమార్ శనివారం అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశాడు.
నిర్భయ దోషి పిటిషన్పై రేపు సుప్రీం విచారణ - నిర్భయ దోషి
తన క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు వాదనలు ఆలకించనుంది.
రేపు సుప్రీం వద్దకు నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్
జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏ.ఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పిటిషన్ను విచారించనుంది.
ఫిబ్రవరి 1న నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో ముఖేశ్ పిటిషన్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
Last Updated : Feb 28, 2020, 4:18 AM IST