తెలంగాణ

telangana

By

Published : Feb 6, 2020, 11:50 AM IST

Updated : Feb 29, 2020, 9:29 AM IST

ETV Bharat / bharat

నిర్భయ: కేంద్రం పిటిషన్​పై రేపు సుప్రీం విచారణ

నిర్భయ కేసులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అత్యవసర విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. దోషుల ఉరిపై స్టేను ఎత్తివేయాలని తొలుత దాఖలు చేసిన పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేసింది కేంద్రం.

Nirbhaya case, supreme
నిర్భయ కేసు

నిర్భయ: కేంద్రం పిటిషన్​పై రేపు సుప్రీం విచారణ

నిర్భయ కేసులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​ను శుక్రవారం విచారించనుంది సుప్రీంకోర్టు. నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టేను ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రం వ్యాజ్యం దాఖలు చేసింది.

ఈ వ్యాజ్యాన్ని అత్యవసర విచారణకు స్వీకరించాలని అదనపు సొలిసిటర్​ జనరల్​ కేఎం నటరాజ్​ కోరారు. కేంద్రం అభ్యర్థనను పరిశీలించిన సుప్రీం న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. రేపు విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

దిల్లీ హైకోర్టు స్టే కారణంగా దోషులకు మరణశిక్ష అమలు చేయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. దోషుల రివ్యూ పిటిషన్లతోపాటు ముగ్గురికి సంబంధించిన క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్లూ తిరస్కరణకు గురైనా.. జైలు అధికారులు వారికి ఉరి అమలు చేయలేకపోతున్నారని నటరాజన్‌ కోర్టుకు విన్నవించారు.

ఇదీ చూడండి: నిర్భయ కేసు: సుప్రీంకోర్టులో కేంద్రం వ్యాజ్యం

Last Updated : Feb 29, 2020, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details