తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉరిశిక్ష తప్పించుకోవడానికి నిర్భయ దోషి 'న్యాయ' ప్రయత్నం!

2012లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన నిర్భయ ఘటనలో సుప్రీంకోర్టు విధించిన ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు దోషులు. నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్​ ఇటీవలే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్​ దాఖలు చేశాడు. దాన్ని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. తాజాగా ఉరిశిక్ష నుంచి ఊరట పొందడానికి క్యురేటివ్​ పిటిషన్​ అనే ప్రత్యేక అస్త్రాన్ని వినియోగించుకునేందుకు ఆలోచిస్తున్నట్టు మరో దోషి ముఖేశ్​ తరఫు న్యాయవాది వెల్లడించారు.

curative
నిర్భయ: క్యురేటివ్ విచారణ అనంతరమే రాష్ట్రపతి క్షమాభిక్ష

By

Published : Dec 18, 2019, 6:13 PM IST

Updated : Dec 18, 2019, 7:23 PM IST

ఉరిశిక్ష నుంచి ఊరట పొందేందుకు తమ వద్ద మరొక న్యాయపరమైన అవకాశముందని తెలిపారు నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్​ కుమార్​ తరఫు న్యాయవాది. ఉరిశిక్షకు వ్యతిరేకంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకునే ముందు సుప్రీంకోర్టులో క్యురేటివ్​ పిటిషన్(ప్రైవేట్​ విచారణ)​ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు.

మరో దోషి అక్షయ్​ కుమార్​ రివ్యూ పిటిషన్​ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసినకొద్ది సేపటికే ముఖేశ్​ తరఫు న్యాయవాది ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఏంటీ క్యురేటివ్​ పిటిషన్​?

క్యురేటివ్​ పిటిషన్​ అనేది.. న్యాయపరంగా ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న చివరి సహాయం. ఈ పిటిషన్​.. అరుదైన, ప్రత్యేక కేసుల్లోనే అందుబాటులో ఉంటుంది. క్యురేటివ్​ పిటిషన్​పై విచారణ రహస్యంగా జరుగుతుంది.

ఇదీ జరిగింది...

2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకడు మైనర్​ కాగా.... మరొకడు తిహార్​ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన దోషులైన ముకేశ్​, పవన్​ గుప్తా, వినయ్​ శర్మల రివ్యూ పిటిషన్లను గతేడాది జులై 9నే కోర్టు కొట్టివేసింది. మరో దోషి అక్షయ్​ కుమార్ సింగ్​.. మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ తాజాగా సుప్రీంను ఆశ్రయించాడు. దీనినీ ఈ ఉదయం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

Last Updated : Dec 18, 2019, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details