తెలంగాణ

telangana

By

Published : Feb 17, 2020, 4:12 PM IST

Updated : Mar 1, 2020, 3:08 PM IST

ETV Bharat / bharat

'నిర్భయ' కేసు దోషులకు డెత్​ వారెంట్- మార్చి 3న ఉరి!

delhi-court-issues-fresh-death-warrants
'నిర్భయ' కేసు దోషులకు డెత్​ వారెంట్

16:09 February 17

'నిర్భయ' కేసు దోషులకు డెత్​ వారెంట్- మార్చి 3న ఉరి!

నిర్భయ అత్యాచారం కేసు దోషులకు మరోమారు డెత్​ వారెంట్ జారీచేసింది దిల్లీ కోర్టు. వచ్చే నెల 3న ఉదయం 6 గంటలకు తిహార్ జైలులో ఉరి తీయాలని ఆదేశించింది.

డెత్​ వారెంట్ జారీ చేయాలని నిర్భయ తల్లిదండ్రులు, దిల్లీ ప్రభుత్వం వేసిన వ్యాజ్యంపై ఈమేరకు చర్యలు చేపట్టింది దిల్లీ కోర్టు.

నిరాహార దీక్ష-మానసిక రుగ్మత

డెత్ వారెంట్ జారీచేయాలన్న అభ్యర్థనను వ్యతిరేకించారు దోషుల తరఫు న్యాయవాది. ఉరిశిక్షను తప్పించుకునే లక్ష్యంతో వింత వాదనలు వినిపించారు.

దోషుల్లో ఒకడైన ముకేశ్​ సింగ్‌ తరఫున వాదించేందుకు బృందా గ్రోవర్ స్థానంలో రవి ఖాజిని నియమించింది. అయితే తన తరఫున వాదించేందుకు న్యాయవాది అవరసం లేదని కోర్టుకు తెలిపాడు ముఖేశ్​.

మరో దోషి అక్షయ్.. కొత్తగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయనున్నట్లు న్యాయవాది ఏపీ సింగ్​ కోర్టుకు తెలిపారు. గతంలో దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​కు అన్ని పత్రాలు జోడించలేదని తెలిపిన ఆయన.. పూర్తి వివరాలతో మరోసారి రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నట్లు కోర్టుకు విన్నవించారు.  

నిర్భయ కేసులో మరో నిందితుడైన వినయ్​ శర్మ.. తిహార్ జైలులో నిరాహార దీక్ష చేస్తున్నాడని ఏపీ సింగ్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం వినయ్​ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించాలని అధికారులను ఆదేశించింది కోర్టు.

   "వినయ్ ప్రస్తుతం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వినయ్​పై జైలులో శారీరక దాడి చేశారు. అతని తలపై గాయాలున్నాయి. పవన్​ గుప్తా కూడా రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్​ దాఖలు చేయనున్నాడు. అలాగే సుప్రీంకోర్టులో క్యురేటివ్​ వ్యాజ్యం వేసేందుకు కూడా సిద్ధమయ్యాడు."

   - ఏపీ సింగ్​, దోషుల తరఫు న్యాయవాది

పలు మార్లు వాయిదా...

తొలుత జనవరి 22న నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడాల్సి ఉండగా.. ఫిబ్రవరి 1కు వాయిదా పడింది. దోషులకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నందున మరోసారి వాయిదా వేస్తూ జనవరి 31న నిర్ణయం తీసుకుంది ట్రయల్​ కోర్టు. ప్రస్తుతం తిహార్​ జైల్లో ఉన్న నలుగురు దోషులకు మార్చి 3న మరణ శిక్ష విధించాలని తాజాగా ఇవాళ మరోసారి డెత్​వారెంట్​ జారీ చేసింది. 

Last Updated : Mar 1, 2020, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details