తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష - నిర్భయ కేసు తాజా వార్తలు

నిర్భయ దోషులకు కొత్తగా డెత్​ వారెంట్లు జారీ చేసింది దిల్లీ కోర్టు. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు మరణశిక్ష అమలు చేయాలని ఆదేశించింది. దోషుల్లో ఒకడైన ముకేశ్​ కుమార్​ సింగ్ క్షమాభిక్షను రాష్ట్రపతి నిరాకరించిన నేపథ్యంలో తాజా డెత్​ వారెంట్లు జారీ అయ్యాయి.

nirbhaya-case
'నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష'

By

Published : Jan 17, 2020, 5:03 PM IST

Updated : Jan 17, 2020, 6:55 PM IST

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష

నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషులకు ఉరి శిక్ష ఖాయమైంది. నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని దిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

ఉరిశిక్షను వాయిదా వేయాలని దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్​ సింగ్ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించింది దిల్లీ కోర్టు.​ ముకేశ్​ క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో కొత్తగా డెత్​ వారెంట్లు జారీ చేయాలని తిహార్​ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

జైలు అధికారుల పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముకేశ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తాలను ఉరి తీయాలని డెత్ వారెంట్లు జారీ చేసింది.

జనవరి 7న దిల్లీ కోర్టు జారీ చేసిన డెత్‌ వారెంట్ ప్రకారం ఈ కేసులోని నలుగురు దోషులకు ఈనెల 22న ఉరిశిక్ష విధించాల్సి ఉంది. అయితే తన క్షమాభిక్ష పిటిషన్​ రాష్ట్రపతి వద్ద పెండింగ్​లో ఉందని ఉరిని వాయిదా వేయాలని ముకేశ్​ కోరాడు.

కేసు వివరాలు...

2012 డిసెంబరు 16 రాత్రి 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై దిల్లీలో కదిలే బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్‌ కావడం వల్ల మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి రాంసింగ్ తిహార్​​ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దోషులు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని 2019 జులై 9న కొట్టివేసింది.

Last Updated : Jan 17, 2020, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details