నిర్భయ సాముహిక హత్యాచార ఘటన కేసు మరో మలుపు తిరిగింది. మరణ శిక్ష తప్పించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దోషులు. కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా.. సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఘటన సమయంలో తాను మైనర్‌ను అని, ఈ అంశాన్ని దిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్ దాఖలు చేశాడు.
తాను మైనర్ అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని శిక్ష ఖరారు చేయాలంటూ గతంలో దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు పవన్. దీనిపై విచారించిన న్యాయస్థానం డిసెంబర్ 19న పిటిషన్ కొట్టేసింది.