నిర్భయ కేసు దోషి ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. రాష్ట్రపతి కార్యాలయానికి కేంద్ర హోంశాఖ దరఖాస్తు పంపిన కాసేపటికే కోవింద్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిర్భయ దోషి క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి - నిర్భయ కేసు
12:17 January 17
నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్.. కొన్ని రోజుల క్రితం క్షమాభిక్ష పిటిషన్ను దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ అర్జీని పరిశీలించిన గవర్నర్.. కేంద్ర హోంశాఖ వద్దకు గురువారం పంపారు. ఇవాళ రాష్ట్రపతి కార్యాలయానికి పంపింది హోంశాఖ.
నిర్భయ కేసులో నలుగురు దోషులైన అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ, ముకేశ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాకు జనవరి 22న ఉరిశిక్ష అమలుచేసేందుకు నిర్ణయంచారు. అయితే ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉన్నందున ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని దిల్లీ ప్రభుత్వం బుధవారం.. హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో దిల్లీ హైకోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
TAGGED:
నిర్భయ కేసు