కొత్త రకం కరోనా గురించి బ్రిటన్లో భయాందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ ప్రకటించింది. ఈ నెల 22నుంచి 2021 జనవరి 5 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. యూకేలో పరిస్థితులను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. రాబోయే 15రోజులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు.
కొత్త రకం కరోనా ఎఫెక్ట్- మహారాష్ట్రలో మళ్లీ కర్ఫ్యూ - Maharashtra curfew from Dec 22 to Jan 5
ఐరోపా దేశాలను కలవరపెడుతోన్న కొత్తరకం కరోనా వైరస్ పట్ల మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు 15రోజుల పాటు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది ఠాక్రే ప్రభుత్వం.
కొత్తరకం కరోనా ఎఫెక్ట్- మహారాష్ట్రలో మళ్లీ కర్ఫ్యూ
కర్ఫ్యూ నిబంధనల్లో భాగంగా.. మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడనున్నాయి. అంతేకాకుండా.. ఇటీవల ఐరోపా, పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన వారికి 14రోజుల నిర్బంధం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చదవండి:అక్కడి పంచాయతీ ఎన్నికల బరిలో ఓ 'యాచకుడు'