తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుల్వామా ఉగ్రదాడి కేసులో ఎన్​ఐఏ ఛార్జిషీటు - పుల్వామా దాడిపై ఛార్జిషీటు

పుల్వామా ఉగ్రదాడి కేసులో 18 నెలల తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో జైషే మహ్మద్​ అధినేత మసూద్​ అజర్​ సహా 19 మంది పేర్లు ప్రస్తావించింది.

PULWAMA NIA
పుల్వామా ఉగ్రదాడి

By

Published : Aug 25, 2020, 4:20 PM IST

Updated : Aug 25, 2020, 4:29 PM IST

గతేడాది ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అభియోగ పత్రం దాఖలు చేసింది. సుమారు 13,500 పేజీల సుదీర్ఘ ఛార్జిషీటులో జైషే మహ్మద్ అధినేత మసూద్​ అజర్​తో పాటు అతని బంధువులు అమ్మర్​ ఆల్వి, అబ్దుల్ రవూఫ్​ను చేర్చింది.

ఘటన జరిగిన 18 నెలల తర్వాత ఈ కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్​ ఆధారాలు, వివిధ కేసుల్లో అరెస్టయిన ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేసును పరిష్కరించింది ఎన్​ఐఏ.

19 మందిపై ఛార్జిషీటు..

పాకిస్థాన్​లో జేఈఎం రచించిన ఈ కుట్రలో మొత్తం 19 మందిని నిందితులుగా పేర్కొంది ఎన్​ఐఏ. వీరిలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ దార్​కు ఆశ్రయం ఇచ్చిన వారూ ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పటికే 7 ఉగ్రవాదులు హతం కాగా మరో ఏడుగురు అరెస్టయ్యారు. నలుగురు పరారీలో ఉన్నారు.

ఈ కేసు దర్యాప్తునకు ఎన్​ఐఏ జాయింట్ డైరెక్టర్ అని శుక్లా నేతృత్వం వహించారు. బ్యాటరీలు, ఫోన్లు, ఇతర రసాయనాల కొనుగోలు కోసం ఈ- కామర్స్ సైట్లను ఉపయోగించినట్లు గుర్తించారు.

ఐఈడీ బాంబు రూపొందించిన ఉగ్రవాదులు

పుల్వామా ఉగ్రదాడి..

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ జవాన్ల వాహన శ్రేణి లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఆదిల్​ దార్​ 200 కిలోల ఐఈడీ అమర్చిన కారులో కాన్వాయ్​ను ఢీ కొట్టాడు. ఈ ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.

దాడిలో వాడిన కారు

ఇదీ చూడండి:పుల్వామా దాడి కేసులో మరో ఇద్దరు అరెస్ట్​

Last Updated : Aug 25, 2020, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details