స్వచ్ఛంద కార్యకలాపాల కోసం వినియోగించాల్సిన నిధులను వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు మళ్లిస్తున్న ఎన్జీఓలు, ట్రస్ట్‌లకు సంబంధించిన కేసులో.. జమ్ముకశ్మీర్‌లోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ). బెంగళూరులోనూ తనిఖీలు చేపట్టింది.
ఈ సోదాల్లో నేరాన్ని రుజువు చేసే పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది.
"శ్రీనగర్, బందిపొరలోని 10 ప్రాంతాలు, బెంగళూరులోని ఒక ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. స్వచ్ఛంద కార్యకలాపాల పేరుతో దేశంతో పాటు విదేశాల్లో నిధులు సేకరిస్తున్న ఈ ఎన్జీఓలు, ట్రస్ట్‌లు అనంతరం వాటిని జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాద పనుల కోసం వినియోగిస్తున్నారు. జేకే కొయిలేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ కోఆర్డినేటర్ ఖుర్రమ్ పర్వేజ్, అతని సహచరుడు అహ్మద్ బుఖారి, బెంగళూరుకు చెందిన జీకే ట్రస్ట్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు."