తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ వేర్పాటువాదులకు ఉచ్చు బిగిస్తున్న ఎన్​ఐఏ

జేకేఎల్​ఎఫ్​ అధినేత యాసిన్​ మాలిక్​పై జాతీయ దర్యాప్తు సంస్థ.. దిల్లీ కోర్టులో అనుబంధ అభియోగ పత్రం​ దాఖలు చేసింది. 2017లో జమ్ముకశ్మీర్​ ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసిన కేసుకు సంబంధించి పలువురు వేర్పాటువాదులతో పాటు జమ్ముకశ్మీర్ మాజీ ఎమ్మెల్యే రషీద్ ఇంజినీర్​ను కూడా చార్జిషీట్​లో నిందితులుగా చేర్చింది.

కశ్మీర్​ వేర్పాటువాదులకు ఎన్​ఐఏ ఎదురుదెబ్బ!

By

Published : Oct 4, 2019, 6:15 PM IST


ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశారన్న కేసులో జమ్ముకశ్మీర్​ లిబరేషన్​ ఫ్రంట్​ (జేకేఎల్)​ అధినేత యాసిన్​ మాలిక్​కు ఉచ్చు బిగిస్తోంది ఎన్​ఐఏ. 2017కు సంబంధించిన ఈ కేసులో మాలిక్​పై దిల్లీ కోర్టులో అనుబంధ అభియోగ పత్రం​ దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ.

ఆసియా ఆండ్రాబీ, షాబీర్​ షా, మసారత్​ ఆలం భట్​ వేర్పాటువాదులతో పాటు జమ్ముకశ్మీర్​ మాజీ శాసనసభ్యుడు రషీద్ ఇంజినీర్​ను​ కూడా అభియోగ పత్రంలో నిందితులుగా చేర్చింది ఎన్​ఐఏ. ఈ కేసుపై న్యాయస్థానం ఈనెల 23న విచారణ జరపనుంది. విచారణ ప్రక్రియను కెమెరా ద్వారా చిత్రీకరించనున్నారు.

కస్టడీ పొడిగింపు

ఉగ్రవాదుల ఆర్థిక సాయానికి సంబంధించిన కేసులో యాసిన్​ మాలిక్​ను ఇవాళ దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు ఎన్​ఐఏ అధికారులు. ఆ తర్వాత ఇదే కేసుకు సంబంధించి మాలిక్​ జుడీషియల్​ కస్టడీని ఈ నెల 23వరకు పెంచుతూ.. తీర్పునిచ్చింది కోర్టు. అభియోగ పత్రంలో పేర్కొన్న వేర్పాటువాదులందరికీ 2008 ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్​ సయీద్​తో సంబంధాలపై తాజాగా ఆధారాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.

భారత దౌత్యవేత్త హత్య కేసులోనూ..

జమ్ములో జరిగే వేర్పాటువాద కార్యకలాపాల్లో జేకేఎల్​ఎఫ్​ ముందుస్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండితుల హత్యల్లోనూ వీరిపాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. వీరి దురాగతాలతో కశ్మీర్​ నుంచి భారీ సంఖ్యలో పండితులు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ జేకేఎల్​ఎఫ్​కు సంబంధాలు ఉన్నాయి.

ఇదీ చూడండి:బంగ్లాదేశ్​ ప్రధానికీ తప్పని ఉల్లి కష్టాలు..!

ABOUT THE AUTHOR

...view details