తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఐఏ తనిఖీలు: అల్​ఖైదాకు చెందిన 9 మంది అరెస్ట్ - అల్​ఖైదా ఉగ్రవాద సంస్థ

అల్​ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా కార్యకలాపాలు సాగిస్తోన్న 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. బంగాల్​, కేరళలో జరిపిన సోదాల్లో వీరు పట్టుబడ్డారు.

NIA busts Al-Qaeda module in West Bengal and Kerala; arrests few Al-Qaeda operatives after raids
ఎన్​ఐఏ సోదాల్లో 9మంది అరెస్ట్​

By

Published : Sep 19, 2020, 9:02 AM IST

Updated : Sep 19, 2020, 10:06 AM IST

దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) విస్తృత తనిఖీలు నిర్వహించింది. బంగాల్​లోని ముర్షిదాబాద్​, కేరళలోని ఎర్నాకులంలో అల్​ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉగ్రకార్యకలాపాలు సాగిస్తోన్న 9 మందిని అరెస్ట్ చేసింది.

దేశ రాజధాని ప్రాంతం (ఎన్​సీఆర్​)లో వీరు దాడులకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందడం వల్ల ఈ సోదాలు నిర్వహించినట్టు ఎన్​ఐఏ పేర్కొంది. తనిఖీల్లో భాగంగా డిజిటల్​ పరికరాలు, పత్రాలు, జిహాదీ సాహిత్యం, పదునైన ఆయుధాలు, దేశీయ తుపాకులు, పేలుడు పరికరాలను రూపొందించేందుకు కావల్సిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఎన్​ఐఏ వెల్లడించింది.

ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వీరు దిల్లీ వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేసింది ఎన్​ఐఏ.

ముసారఫ్​ హుస్సేన్​
ముర్షిద్​ హాసన్​
అబు సుఫియన్​
లియు ఇయన్​ అహ్మద్​

ఇదీ చూడండి:-ఇస్లామిక్​ స్టేట్​లోకి తెలుగు రాష్ట్రాల వ్యక్తులు!

Last Updated : Sep 19, 2020, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details