పుల్వామా దాడిలో పాలుపంచుకున్న ఓ జైషే మహ్మద్ ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం అరెస్టు చేసింది. నిందితుడిని పుల్వామాలోని కాకపొరా ప్రాంతం హజీబల్కు చెందిన ఫర్నీచర్ వ్యాపారి షేక్ బషీర్ మాగ్రేగా గుర్తించింది. పుల్వామా దాడిలో ఆత్మాహూతి చేసుకున్న ఆదిల్ అహ్మద్ ధార్‌కు బషీర్ ఆశ్రయం కల్పించాడని సమాచారం. పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాది మహ్మద్ ఉమర్ ఫారూఖ్ 2018లో మానవ బాంబు అహ్మద్ ధార్‌ను బషీర్ మాగ్రేకు పరిచయం చేశాడని తెలుస్తోంది.
పుల్వామా కేసులో కీలక ఉగ్రవాది అరెస్టు - పుల్వామా దాడి సూత్రధారి అరెస్టు
పుల్వామా దాడిలో కీలక పాత్రధారిని ఎన్ఐఏ బృందం అరెస్టు చేసింది. అతడిని పుల్వామా లోని కాకపొర ప్రాంతానికి చెందిన అహ్మద్ బషీర్ మాగ్రేగా గుర్తించింది. మానవ బాంబు ఆదిల్ అహ్మద్ ధార్ సహా మరో పాక్ ఉగ్రవాదికి మాగ్రే ఆశ్రయం కల్పించాడని సమాచారం.
పుల్వామా కేసులో కీలక ఉగ్రవాది అరెస్టు
జైషే మహ్మద్ ఉగ్రవాదులకు పలుసార్లు ఆయుధ సామగ్రి, బాంబులను మాగ్రే చేరవేశాడని విచారణ సందర్భంగా వెల్లడైందని అధికారులు తెలిపారు. 2018 ద్వితీయార్థం నుంచి పుల్వామా దాడి జరిగే వరకు పాక్ ఉగ్రవాది ఉమర్ ఫారూఖ్, మానవ బాంబు అహ్మద్ ధార్‌కు మాగ్రే ఆశ్రయం కల్పించాడని బయటపడింది. అదే సమయంలో పుల్వామా దాడిలో ఉపయోగించిన కారులో ఐఈడీని మాగ్రే అమర్చాడని సమాచారం.
ఇదీ చూడండి: పుల్వామా ఉగ్రదాడికి ఏడాది.. అమరులకు 'స్మారక చిహ్నం'
Last Updated : Mar 2, 2020, 9:52 PM IST