పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్‌గా పని చేస్తున్న రజాక్‌భాయ్ అనే వ్యక్తిని గుజరాత్ పశ్చిమ కచ్ జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన ఒక కేసు విచారణలో భాగంగా వచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించింది
గుజరాత్లో ఐఎస్ఐ ఏజెంట్ అరెస్టు - ఐఎస్ఐ ఏజెంట్‌ను అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ
గుజరాత్ పశ్చిమ కచ్ జిల్లాలో పాక్ ఐఎస్ఐ సంస్థకు ఏజెంట్‌గా పని చేస్తున్న రజాక్‌భాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ కేసు విచారణలో భాగంగా అందిన సమాచారం మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎండీ రషీద్ అనే వ్యక్తిని జనవరిలో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. విచారణలో సదరు వ్యక్తి.. పాకిస్థాన్‌కు చెందిన రక్షణ, ఐఎస్ఐ అధికారులకు.. దేశ సమాచారాన్ని చేరవేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు రెండు సార్లు పాకిస్థాన్ వెళ్లి అక్కడి అధికారులతో భేటీ అయినట్లు నిర్ధరించారు. రక్షణ బలగాల కదలికలు, రక్షణకు సంబంధించిన పలు ప్రదేశాల సమాచారాన్ని కూడా అందజేసినట్లు అధికారులు తెలిపారు..
సమాచారం చేరవేసినందుకు గానూ గుజరాత్‌లోని రజాక్‌భాయ్.. రిజ్వాన్ అనే వ్యక్తి పేటీఎం నుంచి రషీద్‌కు 50 వేల రూపాయలను జమ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఐఎస్ఐ ఆదేశాల మేరకు రషీద్‌కు నగదు పంపినట్లు తెలిపారు. దీంతో రజాక్భాయ్ను అరెస్టు చేసింది ఎన్ఐఏ. అతడి ఇంటిలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.