తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఐఏ అదుపులో మరో అల్​ఖైదా ఉగ్రవాది - Pakistan-sponsored module

పాకిస్థాన్​ అల్​ఖైదాకు పనిచేస్తున్న మరో ఉగ్రవాదిని అరెస్టు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). ఇతడిని బంగాల్​కు చెందిన షమీమ్​ అన్సారీగా గుర్తించారు.

NIA arrests another al-Qaeda terrorist from West Bengal
ఎన్​ఐఏ అదుపులో మరో అల్​ఖైదా ఉగ్రవాది

By

Published : Sep 27, 2020, 4:39 PM IST

బంగాల్​లో ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఎ) వేట కొనసాగిస్తోంది. తాజాగా మరో అల్​ఖైదా ఉగ్రవాదిని అరెస్టు చేసింది. ఇతడిని పశ్చిమ్​ బంగా​లోని ముర్షిదాబాద్​కు చెందిన షమీమ్​ అన్సారీగా గుర్తించారు. జలంగీలోని తన నివాసంలో శనివారం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడి నుంచి ఫోన్​ను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

"అల్​ఖైదాకు చెందిన షమీమ్​ అన్సారీని అరెస్టు చేశాం. సంస్థతో సంబంధాల గురించి విచారిస్తున్నాం. గతంలో అదుపులోకి తీసుకున్నవారిని కేరళలో కలిసినట్లు మా దగ్గర ప్రాథమిక సమాచారం ఉంది."

- ఎన్​ఐఏ సీనియర్​ అధికారి

ఇటీవల కేరళ వెళ్లిన షమీమ్​.. కొద్ది రోజుల కిందే బంగాల్​లోని తన ఇంటికి వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

అల్​ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా కార్యకలాపాలు సాగిస్తోన్న 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ సెప్టెంబర్​ 19న అదుపులోకి తీసుకుంది. బంగాల్​, కేరళలో జరిపిన సోదాల్లో వీరు పట్టుబడ్డారు.

ఇవీ చూడండి:

అల్​ఖైదా తీవ్రవాది ఇంట్లో అనుమానాస్పద గది

ఎన్​ఐఏ తనిఖీలు: అల్​ఖైదాకు చెందిన 9 మంది అరెస్ట్

అక్రమ బాంబుల తయారీకి అడ్డాగా బంగాల్​: ధన్​ఖర్​​

ABOUT THE AUTHOR

...view details