ఔరంగాబాద్ రైలు ప్రమాదానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఘటనపై నాలుగు వారాల్లో పూర్తి నివేదిక అందించాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శితోపాటు ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆదేశించింది.
"ప్రమాదానికి సంబంధించి 4 వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలి. పేదలు, వలస కార్మికులు, లాక్డౌన్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా ఈ నివేదికలో పొందుపరచాలి. వారికి ఆహారం, ఆశ్రయం, ఇతర సదుపాయాలు ఏమేం కల్పించారో తెలియజేయాలి."
-ఎన్హెచ్ఆర్సీ
నాందేడ్ డివిజన్లోని బద్నాపుర్- కర్మాడ్ స్టేషన్ల మధ్య పట్టాలపై నిద్రిస్తున్న 20 మంది వలస కూలీలపై నుంచి గూడ్సు రైలు వెళ్లింది. ఈ ఘటనలో 14 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.