హాథ్రస్ ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన ఈ ఘోర సంఘటనలో 19 ఏళ్ల ఓ దళిత యువతిని.. నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, తీవ్రంగా హింసించారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. అయితే.. ఈ సంఘటనను సుమోటో కేసుగా స్వీకరించినట్టు ఎన్‌హెచ్ఆర్సీ ప్రకటించింది. ఈ విషయమై వివరణ కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర డీజీపీకు నోటీసులు జారీచేసింది.
ఇదీ ఘటన..
సెప్టెంబర్ 14న తన తల్లితో కలసి పొలానికి వెళ్లిన యువతి.. అనంతరం కనిపించకుండా పోయింది. తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆమెను సెప్టెంబర్ 22న కనుగొన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం తొలుత అలీఘడ్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్య కోసం సోమవారం దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె సెప్టెంబర్ 29న కన్నుమూసింది. మరుసటి రోజు అర్ధరాత్రి యువతి మృతదేహాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి:యూపీ అత్యాచార బాధితురాలు దిల్లీలో మృతి