తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పటి వరకు దిల్లీలో బాణాసంచా నిషేధం'

దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్​ కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్​7 నుంచి 30వరకు దిల్లీలో బాణాసంచాని నిషేధించాలని సూచించింది.

NGT notice to Centre to ban fire crackers from Nov 7-30
'అప్పటి వరకూ దిల్లీలో బాణాసంచా నిషేధం'

By

Published : Nov 2, 2020, 8:26 PM IST

దిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్​.. అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. నవంబర్​7 నుంచి 30 వరకు నగరంలో బాణాసంచాను నిషేధించాలని సూచించింది. దీంతోపాటు మరో నాలుగు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది.

సామాజిక కార్యకర్త సంతోష్ గుప్తా ఫిర్యాదు మేరకు ట్రైబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది. "ఫైర్​ క్రాకర్స్ వాడకం వల్ల వాయు కాలుష్యం అధికమవుతుంది. కొవిడ్​-19 కేసులు పెరుగుతాయి. బాణాసంచా వాడకం ప్రస్తుత సమస్యకు పరిష్కారం కాదు. టపాసుల వల్ల దిల్లీ గ్యాస్​ ఛాంబర్​లా తయారైంద "ని పిటిషన్​లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details