దేశవ్యాప్తంగా 175 వాయు నాణ్యత పరిశీలన కేంద్రాలను ఆరు నెలల్లో ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి జాతీయ కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించింది.
జాతీయ శుద్ధ వాయు కార్యక్రమం కోసం నివేదిక రూపొందించిన తీరుపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 నాటికి 20 నుంచి 30 శాతం వాయు కాలుష్యం తగ్గిస్తామని తమ నివేదికలో పేర్కొనడాన్ని తప్పుబట్టింది. అది సాధ్యమేనా అని ప్రశ్నించింది జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలోని ఎన్జీటీ ధర్మాసనం.