తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గవర్నర్​​ పదవిపై సుష్మా స్వరాజ్​ స్పష్టత - గవర్నర్​

ఆంధ్రప్రదేశ్​ గవర్నర్​గా తనను నియమించారన్న వార్తలను తోసిపుచ్చారు విదేశాంగ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన ట్వీట్​ను కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ తన ఖాతా నుంచి తొలగించారు.

సుష్మా స్వరాజ్​

By

Published : Jun 11, 2019, 5:35 AM IST

Updated : Jun 11, 2019, 7:24 AM IST

ఆంధ్రప్రదేశ్​ గవర్నర్​గా నియమితులైన తమకు శుభాకాంక్షలు అంటూ కేంద్రమంత్రి హర్షవర్ధన్​ చేసిన ట్వీట్​పై స్పందించారు విదేశాంగ మాజీ మంత్రి, భాజపా సీనియర్​ నేత సుష్మాస్వరాజ్​. తనను గవర్నర్​గా నియమించారన్న సమాచారం నిజం కాదంటూ స్పష్టం చేశారు.

సుష్మా స్వరాజ్​ ట్వీట్​

" విదేశాంగ శాఖ పదవి నుంచి వైదొలిగే సందర్భంగా నేను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మాట్లాడాను. నన్ను గవర్నర్​గా నియమించిన ట్విట్టర్​కు ఈ వివరణ సరిపోతుందేమో..?"-- సుష్మా స్వరాజ్​ ట్వీట్

" ఆంధ్రప్రదేశ్​ గవర్నర్​గా నన్ను నియమించారని వస్తున్న వార్తల్లో నిజం లేదు." -- సుష్మా స్వరాజ్​ ట్వీట్​​

సుష్మా స్వరాజ్​ ట్వీట్​

లోక్​సభ సీట్లు కేటాయించని భాజపా సీనియర్​ నేతలకు గవర్నర్​ పదవులు ఇస్తారన్న వాదనలకు కేంద్రమంత్రి హర్షవర్ధన్​ ట్వీట్​ బలం చేకూర్చింది. సుష్మా స్వరాజ్​ను అభినందిస్తూ ఆయన ట్వీట్​ చేసి, ఆ తర్వాత తొలగించారు.

కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ ట్వీట్​

"ఆంధ్రప్రదేశ్​ గవర్నర్​గా నియమితులైన మా సోదరి, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​కు శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో మీకున్న అనుభవం వల్ల ఆ రాష్ట్ర ప్రజలు లబ్ధి పొందుతారు" అంటూ ట్వీట్​ చేశారు కేంద్ర మంత్రి హర్షవర్ధన్.

ఆరోగ్య కారణాల వల్ల లోక్​సభ సీటు తనకు కేటాయించవద్దని ఎన్నికలకు ముందే స్వయంగా సుష్మా స్వరాజే భాజపా అధిష్ఠానాన్ని కోరారు. ఇటీవల కొలువుదీరిన మోదీ కేబినెట్​లోనూ ఆమెకు చోటుదక్కలేదు. ఆమె స్థానంలో విదేశాంగ మంత్రిగా ఎస్​.జయశంకర్ నియమితులయ్యారు.

Last Updated : Jun 11, 2019, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details