తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బస్సులో పుట్టిన శిశువుకు ఆర్టీసీ డిపో పేరు

ఉత్తర్​ప్రదేశ్​లో ఆర్​టీసీ బస్సులో పుట్టిన శిశువుకు ఆమె తల్లిదండ్రులు 'మహోబా డిపో' అని పేరు పెట్టారు. డ్రైవర్, కండక్టర్ చేసిన సాయానికి కృతజ్ఞతగా వారు తమ బిడ్డకు బస్ డిపో పేరు పెట్టినట్లు చెప్పారు.

Newly born
నవజాత శిశువు

By

Published : Sep 30, 2020, 10:44 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ మహోబా పట్టణంలో ఆసక్తికర ఘటన జరిగింది. తమ ఇంటిలో కొత్తగా పుట్టిన శిశువుకు బస్ డిపో పేరు పెట్టారు ఆమె తల్లిదండ్రులు.

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని మహోబాలోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే ఆర్​టీసీ బస్సులో శిశువుకు జన్మనిచ్చింది ఆ మహిళ. ఆమెకు తోటి మహిళా ప్రయాణికులు సాయం చేశారు.

అనంతరం బస్సు డ్రైవర్​, కండక్టర్​.. తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్​, కండక్టర్​ చేసిన సాయానికి కృతజ్ఞతగా తన కూతురుకు 'మహోబా డిపో' అని పేరు పెట్టినట్లు ఆ మహిళ తెలిపింది.

తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు.. వారిని డిశ్చార్జి చేశారు.

ఇదీ చూడండి:ముంచుకొస్తున్న రోగాలు- సమగ్ర వైద్య సేవలేవీ?

ABOUT THE AUTHOR

...view details