గుజరాత్ మెహ్సానాలో ఆరు రోజుల కవలలకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది.
దాదాపు 93 కరోనా కేసులు నమోదైన మోలీపుర్ గ్రామానికి చెందిన ఓ గర్భిణికీ కరోనా సోకింది. నెలలు నిండి, మే 16న వాద్నగర్ ప్రభుత్వాసుపత్రిలో పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఓ ఆడబిడ్డ, ఓ మగబిడ్డ పుట్టినందుకు కుటుంబసభ్యులు సంతోషించారు. కానీ, ఆరు రోజులకే తల్లికి సోకిన ఆ మహమ్మారి ఆమె ద్వారా బిడ్డలకూ వ్యాపించిందని తేలింది.