తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గల్వాన్' వీర పుత్రులకు యుద్ధ స్మారకం

గల్వాన్​లో చైనా సైన్యంతో భీకరంగా పోరాడి వీర మరణం పొందిన సైనికులకు గుర్తుగా యుద్ధ స్మారకం నిర్మించారు. దౌలత్ బేగ్ ఓల్డీ రహదారికి సమీపంలో ఉన్న కేఎం-120 స్థావరం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.

New war memorial built for 20 Galwan warriors who caused heavy casualties to Chinese Army
గల్వాన్ వీర పుత్రులకు యుద్ధ స్మారకం

By

Published : Oct 3, 2020, 2:44 PM IST

గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మ ఘటనలో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన 20 మంది సైనికులకు గుర్తుగా యుద్ధ స్మారకాన్ని ఏర్పాటు చేసింది భారత సైన్యం. లద్దాఖ్​లోని దుర్బుక్-శ్యోక్-దౌలత్ బేగ్ ఓల్డీ రహదారికి సమీపంలో ఉన్న కేఎం-120 స్థావరం వద్ద ఈ మెమోరియల్​ను నిర్మించింది.

స్మారకంపై 20 మంది సైనికుల పేర్లతో పాటు జూన్ 15న జరిగిన ఆపరేషన్ వివరాలు పొందుపర్చారు.

"2020 జూన్ 15న గల్వాన్​ లోయలో కమాండింగ్ అధికారి కర్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని సైనిక బృందం పీఎల్​ఏ అవుట్​పోస్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. జనరల్ ఏవై నాలా నుంచి పెట్రోలింగ్ పాయింట్ 14(పీపీ 14) వరకు అవుట్ పోస్టును తరలించేందుకు ప్రయత్నించారు. ఈ పనిని విజయవంతంగా ముగించి పీపీ 14కి చేరుకున్నారు. అక్కడ భారత సైన్యానికి పీఎల్​ఏ దళాలకు మధ్య భీకర పోరు జరిగింది. కర్నల్ సంతోష్ బాబు తన బృందాన్ని ముందుండి నడిపించారు. పీఎల్ఏ సైన్యంతో పోరాటం చేసి భారీ ప్రాణనష్టం కలిగించారు."

-స్మారకంపై రాసి ఉన్న వివరాలు

మే నెల నుంచి భారత్, చైనా సైన్యాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫింగర్ ఏరియాలతో పాటు, గల్వాన్ లోయ, హాట్​ స్ప్రింగ్స్, కొంగ్రుంగ్ నాలా ప్రాంతాల్లో చైనా సైన్యం చొరబాట్లకు ప్రయత్నించింది. గల్వాన్​లో జరిగిన హింసాత్మక ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇప్పటివరకు ఎన్ని చర్చలు జరిగినా సమస్య ఓ కొలిక్కి రాలేదు.

ఇదీ చదవండి-బాలాసోర్​లో శౌర్య క్షిపణి​ ప్రయోగం విజయవంతం

ABOUT THE AUTHOR

...view details