తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​నుంచి రక్షణకు సరికొత్త టీ షర్టులు - anti corona t shirts news

కరోనా వైరస్​ను నాశనం చేసే సరికొత్త టీషర్టులను మన దేశానికి చెందిన రెండు అంకుర సంస్థలు అభివృద్ధి చేశాయి. తక్కువ ధరకే వీటిని విపణిలోకి అందుబాటులోకి తీసుకొచ్చాయి.

new Tshirts to protect from corona
కొవిడ్​నుంచి రక్షణకు సరికొత్త టీ షర్టులు

By

Published : Oct 4, 2020, 5:43 AM IST

కొవిడ్ మహమ్మారి నుంచి రక్షణ కల్పించేందుకు సరికొత్త టీషర్టులు, ఔషధ ద్రావణాన్ని మన దేశానికి చెందిన రెండు అంకుర సంస్థలు అభివృద్ధి చేశాయి. ఇ-టెక్స్, క్లెన్స్​టా అనేవి ఐఐటీ దిల్లీలో పురుడు పోసుకున్న రెండు అంకుర సంస్థలు. 'ఇ-టెక్స్ 'యాంటీవైరల్ ఫాబ్రిక్​తో తాజాగా టీ-షర్టులను తయారు చేసింది. వాటి ఉపరితలాన్ని తాకితే కరోనా వైరస్​ సహా ఏ సూక్ష్మజీవులైనా సరే అంతమవుతాయి. 30సార్లు ఉతికిన తరువాత కూడా యాంటీ వైరల్ సామర్థ్యాన్ని కోల్పోకపోవటం ఈ టీషర్టుల ప్రత్యేకత. వాటిపై ఉండే రసాయనం మానవులకు, ప్రకృతికి ఏమాత్రం హానికరం కాదని నిపుణులు తేల్చారు.

మరోవైపు తాము రూపొందించిన ఔషధ ద్రావణం 99.9శాతం వరకు సూక్ష్మక్రిములను నాశనం చేయగలదని క్లెన్స్​టా సంస్థ తెలిపింది. ఒక్కసారి పూసుకుంటే 24గంటలవరకు అది ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇ-టెక్స్ టీషర్టులు, క్లెన్స్​టా ద్రావణంతో కూడిన కిట్​లను ఐఐటీ దిల్లీ డైరెక్టర్ వి. రామ్​గోపాల్​రావు శుక్రవారం ఆవిష్కరించారు.

ABOUT THE AUTHOR

...view details