తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేటి నుంచి ఉత్తర రైల్వే కొత్త సమయ పట్టిక - రైల్వే శాక

267 రైళ్ల రాకపోకల సమయాల్లో భారీ మార్పులు చేసింది భారతీయ రైల్వే. కొన్ని రైళ్ల ప్రయాణ దూరాలను పెంచగా మరికొన్నింటి ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. ఈ మార్పులు నేడు అమల్లోకి రానున్నాయి.

ఉత్తర రైల్వే కొత్త సమయ పట్టిక

By

Published : Jul 1, 2019, 6:01 AM IST

Updated : Jul 1, 2019, 6:11 AM IST

267 రైళ్ల రాకపోకలకు సంబంధించి భారతీయ రైల్వే తలపెట్టిన మార్పులు నేడు అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు మరో 5 రైళ్ల ప్రయాణ దూరాలను పెంచింది.

ప్రయాణ దూరం పెరిగిన రైళ్లు

  • ఉత్తర రైల్వే జోన్​ నుంచి దిల్లీ-ఛండి​గఢ్​​-దిల్లీ, దిల్లీ-లఖ్​నవూ-దిల్లీ మార్గాల్లో రెండు కొత్త రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.
  • దేవి ఎక్స్​ప్రెస్ ఇంతకు ముందు దెహ్రాదూన్​​-దిల్లీ మధ్య నడుస్తుండగా ఇప్పుడు కోల్​కతా వరకు ప్రయాణిస్తుంది.
  • ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​-మోరాదాబాద్​ మధ్య నడిచే పాసింజర్​ రైలును గజ్రౌల వరకు పొడగించింది ఉత్తర రైల్వే.
  • 'అంబాలా-అంబ్​ అందౌరా డెము' ఇకపై దౌలత్​పూర్ వరకు నడవనుంది.

దిల్లీ-లుదియానా మధ్య నడిచే శతాబ్ది ఎక్స్​ప్రెస్​ లోహియన్​ కాస్​ వరకు పొడగించింది. అయితే ప్రస్తుతం వారానికి ఐదు సార్లు నడిచే ఈ రైలు పని వేళలను రెండు రోజులకు కుదించింది.

ఇప్పటివరకు వారానికి మూడు రోజుల పాటు నడిచిన అలహాబాద్-దిల్లీ-అలహాబాద్ 'హమ్​సఫర్​ ఎక్స్​ప్రెస్' ఇప్పుడు నాలుగు రోజులు పనిచేయనుంది.

ఉత్తర రైల్వే జోన్​ పరిధినలో 148 రైళ్లు బయల్దేరే సమయాల్లో మార్పులు జరిగాయి. వీటిలో 93 రైళ్లు ఇప్పటి వరకు ఉన్న సమయం కన్న ముందుగా బయల్దేరనున్నాయి. 55 రైళ్లు బయల్దేరే సమయాలను వెనక్కి నెట్టారు.

అదే విధంగా 57 రైళ్ల గమ్యస్థలం చేరే సమయాలను తగ్గించగా.. 61 రైళ్ల సమయాలను పెంచింది.

ఇదీ చూడండి: రూ.2700కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

Last Updated : Jul 1, 2019, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details