తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​ క్యాంటీన్​లో రాయితీకి స్వస్తి.. కొత్త ధరలు ఇవే - ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌

పార్లమెంట్ క్యాంటీన్‌లో చట్టసభ సభ్యులకు రాయితీలు ఉపసంహరించిన కేంద్రం.. అందుబాటులో ఉన్న వివిధ ఆహార పదార్థాల సవరించిన ధరల పట్టికను విడుదల చేసింది. ఇప్పటివరకూ హైదరాబాదీ మటన్ బిర్యానీ రూ.65కి లభిస్తుండగా.. దానిని రెండింతలకుపైగా పెంచింది.

new-prices-announced-for--parliament-canteens-food-items
పార్లమెంట్ క్యాంటీన్‌లో కొత్త ధరల పట్టిక

By

Published : Jan 28, 2021, 1:22 PM IST

దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్‌లో చట్టసభ సభ్యులకు అందిస్తోన్న రాయితీలకు స్వస్తి పలుకుతూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు.. లోక్‌సభ సెక్రటేరియట్‌ కొత్త ధరలతో కూడిన ఆహారపదార్థాల జాబితాను విడుదల చేసింది. కొత్త మెనూలో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించింది.

క్యాంటీన్‌లో అత్యంత చౌకగా ఒక చపాతీ రూ.3కి లభిస్తుండగా.. నాన్ వెజ్ బఫెను రూ.700లకు పెంచుతూ ఈ మార్పులు చేసినట్లు సచివాలయం వెల్లడించింది. వెజ్‌ బఫె ధర రూ.500గా ఉంది. హైదరాబాదీ మటన్ బిర్యానీని ఇన్ని రోజులు రూ.65కి అందించేవారు. ఇప్పుడు ఆ ధరను రూ.150కు పెంచింది. అలాగే వెజ్‌ మీల్ ఇక నుంచి రూ.100కి లభించనుంది. కాగా, ఈ నెల 29 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.

పార్లమెంట్ క్యాంటీన్‌లో కొత్త ధరల పట్టిక
పార్లమెంట్ క్యాంటీన్‌లో కొత్త ధరల పట్టిక

ఖర్చుల కట్టడికి ఈ చర్యతో ఏటా రూ.8 కోట్లు ఆదా కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇక నుంచి ఈ క్యాంటీన్‌ను ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ నిర్వహించనుందని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా వెల్లడించారు. ఇంతకాలం నార్తన్‌ రైల్వే దాని నిర్వహణ బాధ్యతలు చూసింది.

ఇదీ చదవండి:రాజ్యసభ సమావేశాలపై వెంకయ్య సమీక్ష

ABOUT THE AUTHOR

...view details