మహారాష్ట్రలో నెలరోజుల పాటు కొనసాగిన ప్రభుత్వ ఏర్పాటు అనిశ్చితికి నాటకీయంగా తెరపడింది. ఎన్సీపీ మద్దతుతో దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణం చేశారు.
గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఇరునేతలు బాధ్యతలు స్వీకరించారు.
"రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంపై ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు. మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. మాతో కలసి పోటీ చేసిన శివసేన ప్రజా ఆమోదానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. ఈ కారణంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన మహారాష్ట్రకు గౌరవం తెచ్చేది కాదు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. ఓ కిచిడీ ప్రభుత్వం కాదు. ఈ సమయంలో నేను ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌కు అభినందనలు తెలుపుతున్నాను. మా నిర్ణయాన్ని గవర్నర్‌కు తెలిపాం."
-దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం స్పందించారు అజిత్ పవార్. ఫలితాల నాటి నుంచి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందన్న ఆయన వ్యవసాయం సహా రాష్ట్రం పలు సమస్యలు ఎదుర్కొంటోందని.. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
'మాకు నమ్మకం ఉంది..'