తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంటలో వైరస్‌ల నిర్మూలన.. సరికొత్త యంత్రం ఆవిష్కరణ - గంటలో వైరస్‌ల నిర్మూలన

ప్రస్తుతం కరోనా వైరస్​ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమయ్యారు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు. అయితే.. కొన్ని సంస్థలు వేరే మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇదే కోవలో ఆసుపత్రులను గంటలోనే ఇన్​ఫెక్షన్​ రహితంగా మార్చగల ఓ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది సైటెక్​ పార్క్​ అనే అంకుర సంస్థ. కొవిడ్​ రోగులకు చికిత్స అందించే వైద్యులు, సిబ్బంది వైరస్​ బారిన పడే ముప్పును తాజా యంత్రం తగ్గించే అవకాశముంది.

Eradication of viruses in a matter of hours .. New machine discovery
గంటలో వైరస్‌ల నిర్మూలన.. సరికొత్త యంత్రం ఆవిష్కరణ

By

Published : Mar 31, 2020, 6:18 AM IST

ఆస్పత్రులను సత్వరం ఇన్‌ఫెక్షన్‌ రహితంగా మార్చగల సరికొత్త యంత్రం ఒకటి అందుబాటులోకి వచ్చింది. దాని పేరు సైటెక్‌ ఎయిర్‌ఆన్‌. కూలర్‌ వంటి ఈ యంత్రం ప్రతి 8 సెకన్లకు 10 కోట్ల నెగిటివ్‌ అయాన్లను వెదజల్లుతుంది. ఫలితంగా.. కేవలం గంటలోనే ఆస్పత్రి గదుల్లో వైరస్‌ల ప్రభావాన్ని (వైరల్‌ లోడ్‌ను) 99.7% తగ్గిస్తుంది.

వైరస్‌ల ఉపరితలంపై ఉండే ప్రోటీన్‌ను ఈ యంత్రం నుంచి వచ్చే డిటర్జెంట్‌ ప్రాపర్టీ ధ్వంసం చేస్తుంది. కార్బన్‌ మోనాక్సైడ్‌, నెట్రోజన్‌ డై ఆక్సైడ్‌ వంటి కలుషిత వాయువులను నిర్వీర్యం చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లు, హానికారక వాతావరణ కారకాలను తట్టుకొనేలా శరీర శక్తిని పెంచడం దీని మరో ప్రత్యేకత. పుణెకు చెందిన సైటెక్‌ పార్క్‌ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేసిన ఈ యంత్రాన్ని ఇప్పటికే పలు రకాల వైరస్‌లపై విజయవంతంగా ప్రయోగించారు.

అక్కడే ఉపయోగం...

రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలతోపాటు విమాన క్యాబిన్లు, ఇళ్లలో వాడకానికి ఇది అనువుగా ఉంటుంది. ఈ యంత్రాల ఉత్పత్తి కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ రూ.కోటి విడుదల చేసింది. త్వరలో అందుబాటులోకి రానున్న వెయ్యి పరికరాలను మహారాష్ట్రలోని వివిధ ఆసుపత్రుల్లో ఏర్పాటుచేయనున్నారు. కొవిడ్‌ రోగులకు చికిత్సనందించే వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది వైరస్‌ బారిన పడే ముప్పును తాజా యంత్రం తగ్గించే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details