తమిళనాడు సాలెం పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అధునాతన సాంకేతికతతో రైతు నేస్తాలయ్యారు. అన్నదాతల కోసం ఓ మొబైల్ యాప్ తయారు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అయస్కాంత నీటితో 'ఆటోమెటిక్ సేద్యం' ఆవిష్కరించి సాంకేతిక రంగంలో సత్తా చాటారు.
స్మార్ట్ వ్యవసాయం
సాలెం పట్టణంలోని త్యాగరాజ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అన్నదాతల కోసం రెండు అత్యాధునిక సాంకేతికతలను ఆవిష్కరించారు.
డిజిటల్ ఇండియా నిర్మాణంలో 'స్మార్ట్ వ్యవసాయం' తొలిమెట్టు అంటూ ఓ మొబైల్ యాప్ రూపొందించారు కళాశాలకు చెందిన బాలికల బృందం. ఈ యాప్‌కు అనుసంధానం చేసిన పరికరాలతో.. గాలిలో తేమను అంచనా వేయొచ్చు. ఆటోమేటిక్ వాటర్ సిస్టమ్ ద్వారా ఫోన్ నుంచే పంటకు నీళ్లు అందించవచ్చు. ఆటోమెటిక్ ఫెర్టిలైజేషన్ సిస్టమ్‌తో ఎరువులు చల్లేయొచ్చు.
ఈ యాప్‌తో రైతు ప్రతి రోజూ పొలం వద్దకు వెళ్లే అవసరం లేకుండానే పంట ఎలా ఉందో చూసుకుని, వ్యవసాయం చేయొచ్చు అంటున్నారు విద్యార్థినులు. పంటకు సమయానుకూలంగా నీరు, ఎరువులు అందేలా చూడొచ్చు అంటున్నారు.
"ఏటా ఏఐసీటీఈ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఇండియా హ్యాకథాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది మా కళాశాల ప్రిన్సిపల్ సూచన మేరకు మా ఆవిష్కరణలను హ్యాకథాన్‌లో ప్రదర్శించాం. ఈ యాప్ మొక్కల పెరుగుదలను పర్యవేక్షిస్తుంది. అంతే కాదు, ఆటోమేటిక్ ప్లాంట్ వాటర్ సిస్టమ్ కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంది. "