దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారితో పోరాడుతున్నవారికి కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి కాస్తా ఎక్కువ సమయం పట్టే అవకాశముందని తెలిపింది.
కోలుకున్నా కొన్ని లక్షణాలుంటాయి: కేంద్రం - new guidelines for patients
కరోనా మహమ్మారితో పోరాడుతున్న వారికి కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు, ఊపిరితీసుకోవటంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటాయని తెలిపింది. అయితే.. ఆందోళన అవసరం లేదని, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించింది.
కోలుకున్నా కొన్ని లక్షణాలుంటాయ్: కేంద్రం
మార్గదర్శకాల్లోని అంశాలు..
- కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా వ్యాయామం చేయాలి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి.
- గుండె పని తీరు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను తరచూ పరీక్షించుకోవాలి.
- ఎప్పటిలాగే మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, సామాజిక దూరాన్ని పాటించం తప్పనిసరి.
- తగినంత గోరువెచ్చటి నీరును ఎప్పటికప్పుడు తాగాలి.
- హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిలో జర్వం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, భరించలేని గుండె నొప్పి లక్షణాలు కనిపిస్తే ముందే గుర్తించి, ఆలస్యం చేయకుండా దగ్గర్లోని వైద్యులను సంప్రదించాలి.
- ఇప్పటికే మహమ్మారి నుంచి కోలుకున్నవారు తమ అనుభవాలను చుట్టుపక్కల ప్రజలకు, మీడియాకు, స్థానిక నాయకులతో పంచుకోవాలి. తద్వారా కరోనాపై ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలను నియంత్రించే అవకాశముందని కేంద్రం వివరించింది.
ఇదీ చూడండి: భార్యను కాల్చి చంపి సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య