కేరళ రాష్ట్రంలో 'ప్లాస్మోడియం ఓవల్' అనే కొత్త రకం మలేరియాను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. ఈ వ్యాధి సుడాన్ నుంచి వచ్చిన ఓ జవాను సోకినట్లు గుర్తించామని చెప్పారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
" రాష్ట్రంలో కొత్త రకం మలేరియా ప్లాస్మోడియం ఓవల్ను గుర్తించాం. కన్నూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవాను శరీరంలో ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది. అతను సుడాన్ నుంచి వచ్చాడు. సరైన సమయంలో చికిత్స అందించటం, నివారణ చర్యలు చేపట్టటం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోగలిగాం. "