తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మన విద్యావ్యవస్థలో అమెరికా తరహా స్వేచ్ఛ కావాలి' - నూతన విద్యా విధానంలోని కీలక అంశాలు

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ... కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్​లోని నల్సార్​ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఫైజాన్ ముస్తాఫా. అయితే ఈ విధానానికి చట్టబద్ధత అవసరమన్నారు ముస్తాఫా. 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని సూచనలు చేశారు. ఆ వివరాలు ముస్తాఫా మాటల్లోనే.

experts view on new Education policy
నూతన విద్యా విధానంపై నిపుణుల హర్షం

By

Published : Aug 2, 2020, 2:15 PM IST

దేశ విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ.. కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంలో అమెరికా విద్యావ్యవస్థ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్నారు హైదరాబాద్​లోని నల్సార్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఫైజాన్​ ముస్తాఫా. నూతన విద్యా విధానంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. దానికి చట్టబద్ధత కూడా అవసరమన్నారు.

'ఈటీవీ భారత్​'ప్రత్యేక ఇంటర్వ్యూలో నూతన విద్యా విధానంపై అనేక అంశాలను పంచుకున్నారు ముస్తాఫా.

అమెరికా తరహా స్వేచ్ఛ కావాలి..

అమెరికా, బ్రిటన్​లతో పోలిస్తే.. మన దేశంలో ఉన్నత విద్యలో నియంత్రణ ఎక్కువగా ఉన్నట్లు ముస్తాఫా తెలిపారు. అక్కడ కళాశాలలకు డిగ్రీలు ప్రధానం చేసే అధికారులు ఉంటాయని చెప్పుకొచ్చారు.

'కేంద్రం తెచ్చిన కొత్త విద్యా విధానం... సరళత్వం ఉండాలని చెబుతున్నా నియంత్రణలూ తప్పనిసరని పేర్కొంటుంది. అలాంటప్పుడు కళాశాలలకు, యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చి ప్రయోజనం ఉండదని' అంటున్నారు. ఇందుకోసం అమెరికా తరహా స్వయం ప్రతిపత్తిని మన యూనివర్సిటీలకు, కళాశాలలకు కల్పించాలని ముస్తాఫా సూచించారు.

  • నూతన విద్యావిధానంపై ఫైజాన్ ముస్తాఫా వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సూచనలు ఆయన మాటల్లోనే..
    ఈటీవీ భారత్​తో ఫైజాన్​ ముస్తాఫా ముఖా ముఖి

ఇదీ చూడండి:సమగ్ర విద్యా విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి

ABOUT THE AUTHOR

...view details