తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫాస్ట్​ట్యాగ్' వినియోగదారుడికి రూ.లక్షన్నర కుచ్చుటోపీ

ఫాస్ట్​ట్యాగ్​ పేరిట ఓ వినియోగదారుడి నుంచి రూ.లక్షన్నర కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఫాస్ట్​ట్యాగ్​ పనిచేయటం లేదని కస్టమర్​ కేర్​కు ఫోన్​ చేయగా.. మరో నంబర్​ నుంచి కాల్​ చేసి సొమ్ము కాజేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

fastag
ఫాస్ట్​ట్యాగ్

By

Published : Oct 1, 2020, 9:34 PM IST

కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన 'ఫాస్ట్‌ట్యాగ్' పేరిట సైబర్​ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరులో ఓ వినియోగదారుడి నుంచి రూ.1.48 లక్షలు కొట్టేశారు కేటుగాళ్లు. ఫాస్ట్​ట్యాగ్​లో సమస్యపై కస్టమర్​ కేర్​కు కాల్ చేయగా.. ఈ ఘటన జరిగిందని బాధితుడు వివరించాడు.

బెంగళూరుకు చెందిన వెంకటప్ప అనే వ్యక్తి.. తన కారులోని ఫాస్ట్​ట్యాగ్​ పనిచేయటం లేదని కస్టమర్​ కేర్​ నంబర్​కు ఫోన్​ చేశాడు. కానీ, ఎవరూ స్పందించలేదు. కొన్ని నిమిషాల తర్వార వెంకటప్పకు మరో నంబర్​ నుంచి ఫోన్​ వచ్చింది.

తిరిగి కాల్​ చేసి..

"మేం ఫాస్ట్​ట్యాగ్​ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఖాతా బ్లాక్ అయింది. మేం చెప్పినట్లు చేయండి" అని అవతలి వ్యక్తి చెప్పారు. తన కంప్యూటర్​లో 'ఎనీ డెస్క్​' లేదా 'క్విక్ సపోర్ట్'ను డౌన్​లోడ్​ చేసుకోవాలని చెప్పినట్లు వెంకటప్ప వివరించాడు.

అంతేకాకుండా అందులో ఖాతా వివరాలు నమోదు చేయాలని సూచించగా.. వెంకటప్ప అలాగే చేశాడు. అనంతరం వచ్చిన వన్​టైం పాస్​వర్డ్ చెప్పాలని అవతలి వ్యక్తి అడిగాడు. అతనికి ఓటీపీ చెప్పిన వెంటనే తన ఖాతా నుంచి దఫాల వారీగా రూ.1.48 లక్షలు పోయాయని తెలిపాడు. ఈ విషయంపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంకటప్ప.

వెంకటప్ప బ్యాంకు ఖాతా లావాదేవీ
ఖాతా నుంచి పోయిన డబ్బు
ఒక దఫాలో పోయిన సొమ్ము

ఇదీ చూడండి:కేంద్రం 'వైఫల్యం'పై వ్యాజ్యం- కొట్టివేసిన సుప్రీం

ABOUT THE AUTHOR

...view details