తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 38కి చేరిన కొత్త కరోనా కేసులు - health ministry

భారత్​లో కరోనా కొత్త రకం (స్ట్రెయిన్​) వైరస్‌ కేసుల సంఖ్య 38కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. బాధితులంతా సింగిల్​ రూం ఐసోలేషన్​లో ఉన్నట్లు స్పష్టం చేసింది.

New COVID-19 strain: Total 38 people in India test positive
దేశంలో 38కి చేరిన కొత్త కరోనా కేసులు

By

Published : Jan 4, 2021, 4:56 PM IST

దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్​ విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఈ తరహా కేసులు 38 నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్​ బాధితులంతా ఆయా రాష్ట్రాల్లో సింగిల్​ రూం ఐసోలేషన్​లో ఉన్నట్లు పేర్కొంది. పాజిటివ్​గా నిర్ధరణ అయిన వ్యక్తుల తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తించి వారికి కూడా పరీక్షలు జరుపుతున్నట్లు స్పష్టం చేసింది. వారు కూడా నిర్బంధంలోనే ఉన్నట్లు తెలిపింది.

ఎక్కడెక్కడ ఎన్ని..

  • నిమ్హన్స్​(బెంగళూరు) -10
  • సీసీఎంబీ(హైదరాబాద్​) -3
  • ఎన్​ఐవీ(పుణె) -5
  • ఐజీఐబీ(దిల్లీ) -11
  • ఎన్​సీడీసీ(దిల్లీ) -8
  • ఎన్​సీబీజీ(కోల్​కతా) -1

తొలుత బ్రిటన్​లో గుర్తించిన ఈ కొత్త రకం కరోనా ఇప్పటికే 30కిపైగా దేశాలకు వ్యాపించింది. భారత్​లోనూ ఈ వైరస్​ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇప్పటికే డిసెంబర్​ 23 అర్ధరాత్రి నుంచి యూకేకు విమాన సర్వీసులను నిలిపివేసింది. జనవరి 5 వరకు ఇది అమల్లో ఉండనుంది.

ఇదీ చూడండి:ఫిబ్రవరి నుంచి ప్రియాంక 'మిషన్​ యూపీ'

ABOUT THE AUTHOR

...view details