తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా 'కొత్త' భయంతో 'వందే భారత్​' సేవలకు బ్రేక్​!

బ్రిటన్ నుంచి వందే భారత్ విషన్ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి శ్రీవాస్తవ తెలిపారు. కొత్త రకం కరోనా స్ట్రెయిన్​ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసున్నట్లు చెప్పారు. రష్యాతో ఈ ఏడాది జరగాల్సిన వార్షిక సమావేశం కరోనా కారణంగా నిర్వహించేలేదని వెల్లడించారు.

New COVID-19 strain: India temporarily suspends Vande Bharat flights from UK, says MEA
వందే భారత్ విమాన సేవలు తాత్కాలికంగా రద్దు

By

Published : Dec 24, 2020, 9:53 PM IST

కొత్త రకం కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి కారణంగా బ్రిటన్​-భారత్​ల మధ్య వందే భారత్ మిషన్​ విమాన సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. డిసెంబర్​ 1న 8వ విడత వందేభారత్ మిషన్​ ప్రారంభమైందని, దీని ద్వారా 27 దేశాల నుంచి 1005 విమానాలు కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ ఒక్క విడతలో 1.8లక్షల మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు వెల్లడించారు.

కరోనా సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఈ ఏడాది మే నుంచి వందే భారత్ విషన్ విమాన సేవలను ప్రారంభించింది కేంద్రం​. డిసెంబర్​ 22వరకు వరకు మొత్తం 8 విడతల్లో 40 లక్షల మంది భారతీయులను వివిధ దేశాల నుంచి స్వేదేశానికి తీసుకొచ్చింది.

అటల్ స్మారక ఉపన్యాసం

మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ 96 జయంతిని పురస్కరించుకొని డిసెంబర్​ 25న 'విదేశాంగ విధానంపై వాజ్​పేయీ స్మారక ఉపన్యాసం' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్య సమాఖ్య అధ్యక్షుడు నిశా బిశ్వాల్ ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నట్లు చెప్పారు.

రష్యాతో సమావేశం రద్దు..

కరోనా కారణంగా భారత్​-రష్యా మధ్య ఈ ఏడాది వార్షిక సమావేశం నిర్వహించలేకపోయామని శ్రీవాస్తవ వెల్లడించారు. రెండు దేశాల పరస్పర అంగీకారం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమావేశానికి కొత్త తేదీలు ఖరారైన వెంటనే తెలియజేస్తామన్నారు. ఈ విషయంపై ఇతర ఉహాగానాలను నమ్మవద్దని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details