దేశంలో కరోనా ఉద్ధృతిలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. కొత్తగా 55,342 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. మరో 706 మంది మరణించారు.
తగ్గిన కరోనా ఉద్ధృతి- కొత్తగా 55,342 కేసులు - ఇండియా కరోనాకేసులు
దేశవ్యాప్తంగా కొత్తగా 55,342 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 706 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 71,75,880కి చేరగా.. మరణాల సంఖ్య 1,09,856కు పెరిగింది. సోమవారం ఒక్కరోజే 10.7 లక్షల కరోనా పరీక్షలు జరిగాయి.
దేశంలో కరోనా ఉద్ధృతిలో కాస్త తగ్గుదల!
సోమవారం 10,73,014 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు చేసిన నమూనా పరీక్షల సంఖ్య 8,89,45,107కు చేరినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:కోయంబేడులో మళ్లీ కరోనా కలకలం.!
Last Updated : Oct 13, 2020, 10:21 AM IST